ఈనెల 26న బీసీ హక్కుల సాధన సమితి మూడవ రాష్ట్ర మహాసభలు.విజయవంతం చేయాలని ధనుంజయ నాయుడు.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్:ఈనెల 26వ తేదీన హైదరాబాద్ ఎల్బీనగర్ లోని భాగ్యనగర్ ఫంక్షన్ హాల్ లో జరగనున్న బీసీ హక్కుల సాధన సమితి మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘము సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.ఆదివారం నాడు ఆయన బీసీ ముఖ్య నాయకులతో కలిసి నేరేడుచర్ల సిపిఐ కార్యాలయం ప్రజా భవన్ లో మాట్లాడుతూ.సామాజిక న్యాయం–సమగ్ర అభివృద్ధికై బీసీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ జాతి,వర్గ,కుల,లింగ వివక్షత లేకుండా అందరికీ సమానత్వాన్ని అందించిందని, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీపాలకులు బీసీలపై  సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని,మనదేశంలో,సామాజికన్యాయం,సమగ్ర అభివృద్ధి చెందాలంటే జనాభాలో సగభాగమైన బీసీలకు స్వాతంత్ర ఫలాలు , అందాలనిఆయన అన్నారు.అధికార వికేంద్రీకరణ మరియు, వనరుల వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల పేదరికం పెరుగుదలకు దోహదం అయ్యిందని మన దేశంలో పశుపక్షాదులకు చెట్టు పుట్టలకు కూడా లెక్కలు ఉన్నాయని కానీ బీసీల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద లెక్క లేదని ఏనాడో స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన బిసి జనాభా లెక్కలే తప్ప స్వతంత్ర భారతదేశంలో బిసి జన గణన చేపట్టిన దాఖలాలు లేవని త్వరలో చేపట్టబోయే జన గణనలో బీసీ జనగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.26వ తేదీ హైదరాబాదులో జరిగే బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర, మహాసభలకు,రాజకీయాలకతీతంగా చైతన్యవంతమైన బిసిలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఆయనవెంట ఏఐవై ఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను,బీసీనాయకులు యల్ల బోయిన సింహాద్రి, అంబటి బిక్షం  ఉన్నారు.
Attachments area
 

తాజావార్తలు