ఈనెల 26న మెగా ప్లాంటేషన్ కు ఏర్పాట్లు చేయాలి

ఆసరా స్పౌస్  పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి రెండవ విడతలో బిసి కుల వృత్తుల లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయాలి మైనార్టీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలి……. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 22  ::::ఈనెల 26న ఒక కోటి  ప్లాంటేషన్ లో భాగంగా జిల్లాలో మెగా ప్లాంటేషన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురితో కలిసి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక కోటి మొక్కల ప్లాంటేషన్ కి సంబంధించి జిల్లాకు కేటాయించిన లక్ష్యం మేరకు ఈనెల 26న మెగా ప్లాంటేషన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారికి సూచించారు. ప్రతి మున్సిపాలిటీ, మండలం , అసెంబ్లీ నియోజకవర్గం, గ్రామపంచాయతీలో ప్లాంటేషన్ జరగాలన్నారు.ఆసరా స్పౌస్ పింఛన్లు, పెంచిన వికలాంగుల పింఛన్ల పంపిణీ కి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి సూచించారు. ఆసరా స్పౌస్ పెన్షన్లలో అర్హులు ఎవరూ తప్పిపోరాదన్నారు.రెండవ విడతలో బిసి కుల వృత్తుల లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీ వేగవంతం చేయాలన్నారు.మైనార్టీ లకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని మైనార్టీ శాఖ అధికారికి సూచించారు. ఆయా ప్రక్రియ మొత్తం వేగవంతం చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.రెండు  రోజులలోగా  హౌస్ సైట్స్ పట్టాల పంపిణీ పూర్తి కావాలని సంబంధిత రెవెన్యూ అధికారులకు సూచించారు.ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, బిసి సంక్షేమ అధికారి జగదీష్, మైనార్టీ సంక్షేమ అధికారి దేవుజా, డిఆర్ఓ నగేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, డిఆర్డిఎ ఎపిడి సూర్యారావు,హౌసింగ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.