ఈనెల 8 న జరిగే సీ.పీ.ఐ. ధర్నాను విజయవంతం చేయండి
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధి లో ఈ నెల 8న తలపెట్టబోయే సీ.పీ.ఐ. ధరణా విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్ట పెల్లి శ్రీనివాస్, ఇప్పకాయల లింగయ్య లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ నెల 8న, జిల్లాలో నూతనంగా ఏర్పాటు అయిన మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలనే దిశలో ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో భాగంగా ఈ నెల 8న, క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వ పెన్షన్లు బ్యాంక్ అకౌంట్ లో వేయాలని, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డు లు మంజూరు, క్యాతన్ పల్లి మున్సి పాలిటీల్లో ఇండ్లు కొనుగోలు చేసుకున్న వాళ్ళ పేర్లు మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పన,,ఇతర అంశాల మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజా సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు సమస్యల పరిష్కారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు నక్క వెంకటస్వామి, వనం సత్యనారాయణ ,మిట్ట పెల్లి పౌల్, పెండ్యాల కమలమ్మ,డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు మారపెల్లి రవి, ఏ ఐ వై ఎఫ్ నాయకులు మోతె రాయలింగు, చొప్పదండి దుర్గ, మామిడల సత్యం, సీపీఐ నాయకులు జంగపెల్లి సత్యనారాయణ, కుక్క దేవానంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.