ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర
వరంగల్: ఈరోజు నుంచి వైద్యుల తెలంగాణ చైతన్య యాత్ర ప్రారంభం కానుంది. ఎంజీఎం నుంచి హైదరాబాద్ గాంథీ ఆస్పత్రి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వైద్యుల తెలంగాణ చైతన్య యాత్రను జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రారంభించనున్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ తెలంగాణ ప్రజా చైతన్యం కోసమే, పోరాడి తెలంగాణ సాధించుకోవాలి పిలుపు నిర్వడం కోసం ఈ యాత్ర చేస్తున్నట్లు డాక్టర్ల జేఏసీ ఛైర్మన్ నర్సయ్య తెలిపారు.