ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 ప్రశాంత్ పాటిల్
కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 10 : సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం దగ్గరలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ తనకి చేశారు. ముందుగా స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో గోదాంద్వారంకు గల తాళం యొక్క సిల్ మరియు తాళాన్ని తీసి షటరు తెరిచారు. ఇలా మూడు నెలలకు ఒకసారి తెరిచి మూసివేయాలన్నారు. గోదాం లోపల పైకప్పు బాగుందా వానకి నీరు కారుతుందా లోపలికి క్రీమీ కీటకాలు, ఎలుకలు, పాములు రాకుండా చర్యలు తీసుకోవడం, లోపల శుభ్రర పరచుకోవడంతో పాటు ఎన్నికల సామాగ్రి భద్రతను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల గోదాము తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. గోదాం చుట్టూ సీసీ కెమెరాలో పనితీరు ఎలా ఉన్నాయి అన్ని విషయాలని దగ్గరికి వెళ్లి చూశారు. మంటలను ఆర్పే పరికరాలు కాలం చెల్లినావి కావున వాటి స్థానంలో ఏదైనా పరికరాలు తీసుకురావాలని ఎలక్షన్ అధికారికి సూచించారు. భద్రత చాలాముఖ్యం అని అన్నారు. పూర్తి తనిఖీ తర్వాత అందరి సమక్షంలో షట్టర్ తాళం వేసి సీల్ వేయడం జరిగింది. పూర్తి తనికీని వీడియోలు, ఫోటోల రూపంలో నిక్షిప్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఎలక్షన్ డిటి శ్రీనివాస్, మండల తాసిల్దార్ రామేశ్వర్, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area