ఈశాన్యంలో భారీ వర్షాలు

విరిగిపడుతున్న కొండచరియలు

న్యూఢిల్లీ,జూన్‌18(జ‌నం సాక్షి): ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో అసోం, త్రిపుర, మణిపూర్‌ ల్లో జనజీవనం స్థంభించింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాట్ల కారణంగా 21 మంది మరణించగా, నాలుగున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. త్రిపుర, అసోంలోని వరద ప్రభావిత ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయ పునరావస సామాగ్రిని బాధితులకు వాయుసేన ద్వారా చేరవేశారు. పలు జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వరద ఉధృతితో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మూడు జిల్లాల్లో 6 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించాయి.