ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్గా మేరికోమ్

ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్గా మేరికోమ్
 న్యూఢిల్లీ/అగర్తల: భారత ఒలంపిక్ బాక్సర్ చాంపియన్ మేరీకోమ్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. ‘డోనర్(డెవలప్ మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్) నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాల ప్రచారం కోసం కొందరు ప్రముఖ వ్యక్తుల కోసం మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో కమిటీ వేశాం.

చివరిగా అది మేరీకోమ్ను ఎంపికచేసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాం’ అని డోనర్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్కు చెందిన మేరీకోమ్ ఇప్పటికే బాక్సింగ్లో ఐదు ప్రపంచ టైటిళ్లను, ఒలంపిక్ను గెలుచుకున్నారు. రియోడిజనరియోలో జరగనున్న ఒలంపిక్ గేమ్స్ అనంతరం తాను బాక్సింగ్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు మేరీకోమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.