ఈ నెల 16 న నిర్వహించనున్న టి.ఎస్.పి .ఎస్.సి. గ్రూప్ -1 పరీక్ష కోసం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన (4) పరీక్ష కేంద్రాలను స్థానిక
మెదక్, అక్టోబర్ 13, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
ఈ నెల 16 న నిర్వహించనున్న టి.ఎస్.పి .ఎస్.సి. గ్రూప్ -1 పరీక్ష కోసం మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన (4) పరీక్ష కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం నాడు పరిశీలించారు. గీతా జూనియర్ కళాశాల, సాధన జూనియర్ కళాశాల, సిద్దార్థ ఆదర్శ్ జూనియర్ కళాశాల, సిద్దార్థ మోడల్ హై స్కూల్ లో ఏర్పాట్లను సంబంధిత జోనల్ అధికారి, లయజన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లను ఉద్దేశించి మాట్లాడుతూ ఎగ్జామ్ పాడ్ అనుమతి లేదు కాబట్టి ఓ.ఏం.ఆర్. షీట్ లు పాడవకుండా అభ్యర్థులకు అనువుగా చదునైన బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి గదిలో సి.సి.కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా మరో సారి పరిశీలించుకొని రేపటిలోగా పూర్తి చేయాలని, కేంద్రం పరిసర ప్రాంతాలను మునిసిపల్ కమీషనర్ సహాకారంతో శుభ్రం చేయించాలని అన్నారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా మూడు,నాలుగు ప్రాంతాలలో హాల్ టికెట్ నెంబర్ ప్రకారం గదుల కేటాయింపు బోర్డులు, మ్యాపు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల క్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్, బ్యాగులు భద్రపరచుటకు కలెక్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మహిళలు టాయిలెట్ వెళ్ళుటకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రతిమ సింగ్ సూచించారు. అభ్యర్థులు సామూహికంగా ఒకే దగ్గర ఉండకుండా చూడాలని, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చూడవలసినదిగా పొలిసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జోనల్ అధికారి నాగరాజ్, లయజన్ అధికారులు శ్రీనివాస్, సత్యనారాయణ, మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, సి.ఐ. మధు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపెరింటెండెట్ లు తదితరులు పాల్గొన్నారు