ఉంగుటూరులో భారీ వర్షం
ఉంగుటూరు: క్రుష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బుడమేరు పోంగిపోర్లుతోంది. దీంతో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరిల్లో వరి నీట మునిగింది. ఉయ్యూరు, తేలప్రోలు అర్ అండ్ బి రహదారిపై లంకపల్లి వద్ద బుడమేరు వంతెనపై వరద నీరు దాదాపు నాలుగడుగులకు పైగా ప్రవహించడంతో వాహనా రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితిని తహసిల్దారు వి. మురళీకృష్ణ పరిశీలిస్తున్నారు.