ఉక్కు కర్మాగారం బయ్యారంలోనే….
మందమర్రి (జనంసాక్షి): ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఇనుప ఖనిజ నిల్వలున్నందున ఆక్కడే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖామాత్యులు బేణివూపసాదవర్మకు టీ ఎంపీలు గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, మంద జగన్నాథం, రాజయ్యలు జమిలిగా ఉత్తరం రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని కాంగ్రెస్ పార్గీ చేప్పి, ఆనక ఇవ్వకపోవడంతో తెడంగాణ ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తిరిగి వనరుల దోపిడీని తీవ్రతరం చేయడం భావ్యం కాదని వారు లేఖలో పేర్కోన్నారు. రైల్వే ప్రాజెక్టులో రాష్ట్రం, కేంద్రం 50-50 వాటాలు పెట్టె పథాకాల్లోకూడా తెలంగాణకు ఆన్యాయం జరిగిందని పేర్కోన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల స్థలాలను విచక్షణారహితంగా ఇతరులకు ధారాదత్తం చెస్తున్నారని పేర్కోన్నారు. బయ్యారం ఇనుమును విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్సాత్ నిగంకు చెందిన ఉక్కు ఫ్యాక్టారీకి పంపడం వల్ల తెలంగాణ ప్రజలు ఉధ్యోగాలు, రెవెన్యూ కోల్పోతిరని పేన్కొన్నారు. అందుకే బయ్యారం లోనే ఉక్కు ఫ్యాక్టారీ పెట్టేలా ఆదేశాలు ఇవ్వలని వారు ఆ లేఖలో విజ్ఞప్తి చేసారు…