ఉక్కు మహిళ దీక్షకు 12 ఏళ్లు
మణిపూర్ నవంబర్ 5 (జనంసాక్షి)
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ చేపట్టిన నిరధిక దాక్షకు సోమవారానికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.ముక్కుద్వారా ఆమెకు ఆహారం ఎక్కించి సజీవంగా ఉంచుతున్నారు.200 నవంబర్ 2వ తేదీన ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని మాలోమ్ వద్ద అస్సాంరైఫిల్స్ జవాన్లు,బాలల సాహస అవార్డు గ్రహీత అయిన పదేళ్ల బాలునితో సహాపదిమందిని కాల్సిచంపటంతో షర్మిల నిరవధిక దీక్ష చేస్తున్నారు. అప్పుడు ఒక దినపత్రికలో ఆమె కాలమిస్టుగా పనిచేస్తున్నారు.ఆమె సంఘసేవాకార్యకర్త కూడా ,2000 నవంబర్ 5న ఆమె నిరవధక దీక్ష ప్రారంభించారు. ఒక రోజు తర్వాత ఆమెను అరెస్టు చేసి ఆత్మహత్యానేరం మోపారు ,అప్పటినుంచి ఆమెను కోర్టుల చుట్టూ తాప్పుతూనే ఉన్నారు.పోరోమ్‌పట్ ప్రభుత్వాస్పత్రిలో ఆమెకు బలవంతంగా ఆహారం ఎక్కిస్తున్నారు.ఆమె వార్డునే జైలుగా మార్చి వేశారు ,పలు అంతర్జాతీయ సంస్థలు ఆమెకు అవార్డులను ఇచ్చాయి పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు పలికారు.