ఉగ్రదాడులు పాక్ పని కాదట!

పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదులు జముకశ్మీర్ లో వరుస దాడులు చేస్తుండగా ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్న రీతిలో రాష్ట్ర సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సాక్షాత్తూ అసెంబ్లీలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దాడులు పాక్ వెలుపలి శక్తుల పనేనని, వారిని అదుపు చేయాలని పాక్ దేశ ప్రధానిని ముఫ్తీ కోరారు. దీనిపై అసెంబ్లీలో విపక్షాలు మండిపడ్డాయి. శుక్ర, శనివారాల్లో ఉగ్రవాదుల వరుస దాడుల ఫలితంగా నలుగురు దుండగులు హతం కావడంతో పాటు ముగ్గురు భద్రత సిబ్బంది, ఒక పౌరుడు బలైన సంగతి తెలిసిందే. ఈ దాడులను ఖండిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన సందర్భంగా ముఫ్తీ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత నవాంగ్ రిగ్జిన్ జోరా అభ్యంతరం వ్యక్తం చేశారు.