ఉగ్రవాదమే పెనుసవాల్‌

05-oct-01

– ప్రధాని మోదీ

– భారత్‌ – సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 3(జనంసాక్షి): తీవ్రవాదం దేశ భద్రతకు పెనుసవాలుగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం దేశానికి ముప్పుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి మన దేశ భద్రతకు సవాలు విసురుతున్నాయని అన్నారు. ఆయన సింగపూర్‌ ప్రధాన మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భగా రెండు దేశాల మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి సమావేశంలో పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం ప్రధాని మాట్లాడారు. రక్షణ, భద్రత విషయంలో రెండు దేశాలు అత్యంత కీలకంగా వ్యవహరించాలని కోరారు. కార్పొరేట్‌ రూపి బాండ్‌ను సింగపూర్‌లో విడుదల చేయడానికి లీ హిసున్‌ లుంగ్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. పట్టణాభివృద్ధి విషయంలో రాజస్థాన్‌కూడా భాగస్వామి అని పేర్కొన్నారు. గత సంవత్సరం తాను సింగపూర్‌లో పర్యటించినపుడు రెండు దేశాల లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి రూపొందించుకున్న ఎజెండాను గుర్తు చేశారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా తమ దేశం ఖండిస్తుందని సింగపూర్‌ ప్రధాన మంత్రి లీ హుసీన్‌ లుంగ్‌ అన్నారు. జమ్ము, కశ్మీర్‌లో యురి సెక్టార్‌పై పాక్‌ ముష్కర మూకలు దాడి చేసిన సందర్భంగా అమరులైన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. యురీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని క్షమించరాదన్నారు.ఎపిరాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ ఆర్థిక సాయం చేస్తుందని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. సింగపూర్‌ ప్రధాని లీ సియన్‌ భారత పర్యటన కొనసాగుతోంది. మంగలవారం మధ్యాహ్నం దిల్లీలో ప్రధాని మోదీని కలిసిన లీ సియన్‌ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త విూడియా సమావేశంలో పాల్గొన్నారు. చ్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ… భారత్‌, సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ తోడ్పడుతుందని వివరించారు. గతేడాది పర్యటనలోనే ఇరుదేశాల మధ్య ఒప్పందాలపై రోడ్‌మ్యాప్‌ తయారుచేశామని పేర్కొన్నారు.నైపుణ్యాభివృద్ధి అంశంలో సింగపూర్‌తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.  భారత్‌, సింగపూర్‌ల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విూద సింగపూర్‌తో రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామన్న మోదీ ఆంధ్రపదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ ఇప్పటికే భాగస్వామ్యం అయిందని చెప్పారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు నిర్మాణాత్మకమైన కృషి చేస్తామని మోదీ అన్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన రెండు అంశాల విూద ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. వాటిలో ఒకటి ఈశాన్య రాష్టాల్ల్రో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను గౌహతిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండోది నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఏర్పాటని ఆయన వెల్లడించారు. ఉదయ్‌పూర్‌లో టూరిజం ట్రైనింగ్‌ సెంటర్‌ను రాజస్థాన్‌ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటికే సింగపూర్‌ భాగస్వామ్యం అయిందని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సింగపూర్‌ ప్రధాని లి సియన్‌, ఇరు దేశాల ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. సింగపూర్‌ ప్రధాని లీ సియోన్‌ మాట్లాడుతూ.. గతేడాది భారత్‌- సింగపూర్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని వెల్లడించారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై పరస్పరం చర్చించుకున్నామన్నారు. ఉరీ దాడి మృతులకు సింగపూర్‌ ప్రధాని నివాళులర్పించారు.