ఉచిత కుట్టు మిషన్ లు పంపిణీ చేసిన వికాస్ రావు
రుద్రంగిి సెప్టెంబర్ 19 )జనం సాక్షి) మండలంలోని నిరుపేద మహిళలకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 55 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ చిన్నమనేని వికాస్ రావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మహిళ సాధికారత లక్ష్యంగా ప్రతిమ ఫౌండేషన్ ముందుకు సాగుతుందని తెలిపారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఫౌండేషన్ తరపున సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రభలతోపాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు.