*ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు*

గద్వాల నడిగడ్డ, జూన్ 14 (జనం సాక్షి);
 ఈనెల 8 నుండి మొదలైన గొర్రెలు, మేకలు కు ఉచిత నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా  జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని చేనుగొని పల్లె గ్రామంలో  మంగళవారము జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ పి. వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు  గొర్రెల కాపరుల యజమానులతో  పలు రకాల సలహాలు సూచనలు చేశారు.
జీవాలు కలుషితమైన మేత, నీటి ద్వారా గొర్రెల శరీరంలోనికి పరాన్నజీవులు గుడ్లు ప్రవేశించి అనేక అనర్థాలకు దారితీస్తుందనీ, జీవాల యొక్క శరీరం లోపల భాగాలైన జీర్ణాశయం, పేగులు, కాలేయము, ఊపిరితిత్తులలో  పరాన్నజీవులు చేయడం ద్వారా  రక్తాన్ని పీల్చడం వలన జీవాలు  బలహీనపడడం, ఆకలిగుణం తగ్గడం, శరీర బరువు, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం వల్ల రైతులకు 30 శాతం వరకు ఆదాయం నష్టపోవడం జరుగుతుందని, 100% గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించటం వలన జీవాల లో ఆకలి గుణం పెరిగి జీర్ణశక్తి పెరగడం వలన రెండు మూడు కేజీల వరకు బరువు పెరగడం సకాలంలో  పునరుత్పత్తి సామర్థ్యం పెరగడం పుట్టబోయే గొర్రెలు మేకలు పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తి కూడా పెరగడం వలన బలిష్టంగా ఉండి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని అభివృద్ధి చెంది రైతులు కూడా ఆర్థికంగా లాభాలు పొందుతూ ఉంటారని జిల్లా పశువైద్యాధికారి  డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.
 ఉచిత నట్టల నివారణ కార్యక్రమం బస్వాపురం, అనంతపురం గ్రామాలలో కూడా మందులను గొర్రెలకు మేకలకు త్రాగించినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో కూడా  ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్  వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడున్న గొర్రెల  యజమానులకు నట్టల నివారణ మందులను ఉపయోగించడం వల్ల లాభాలను కూడా వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి తో పాటు ఉ మండల పశువైద్యాధికారులు డాక్టర్ శంకరయ్య, డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్, జెవివో మాధవి లత, వి. ఎ. పృధ్వి రావు, గొర్రెల సహకార సంఘాలు అధ్యక్షులు కె. భాస్కర్, గొర్రెల కాపరులు, పశువైద్య సిబ్బంది అబ్దుల్ ఖాజ, ఫనీంద్ర రాజు  తదితరులు పాల్గొన్నారు.
Attachments area