ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి): హై దరాబాద్‌కు చెందిన నారాయణ హృద యాలయ హాస్పిటల్‌, వేములవాడ పట్టణ అభివృద్ధి సంక్షేమ స మితి సహకారంతో స్థానిక జవహర్‌లాల్‌ నెహ్రూ పాఠశాల ఆవ రణలో శనివారం నాడు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. వేములవాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 7 వందల మందికి పైగా పేషంట్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య చికిత్సలు నిర్వహించుకున్నారు. ఈ శిబిరంలో నారాయణ హాస్పిటల్‌కు సంబంధించిన జనరల్‌ ఫిజీషియన్లు  డాక్టర్‌ వేణురెడ్డి, డాక్టర్‌ రమేశ్‌, న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ గోపాల్‌, పీడియాట్రిస్ట్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌  శివకుమార్‌రెడ్డి, ఆర్థో పెడిక్‌ డాక్టర్‌ అంజనీ కుమార్‌లతో పాటు ప్ర ముఖ గైనకాలజిస్ట్‌ డాక్ట ర్‌ శ్రీదేవిలు ఆయా వ్యాధులకు సంబం ధించిన పేషంట్లకు వై ద్య సేవలందించారు. వీరితో పాటు హాస్పిట ల్‌కు చెందిన ల్యాబ్‌ టెక్నీషియన్లు, పలువురు సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొన్నారు. అలాగే స్థానిక జెఏసి నాయకులు నేరెళ్ళ తిరుమల్‌గౌడ్‌, పట్టణ అభివృద్ధి సంక్షేమ సమితి చైర్మన్‌ ఈశ్వరగారి రమణ, జెఎన్‌ఎం విద్యాలయాల కరస్పాండెంట్‌ నరహరి శర్మ, రామకృష్ణతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్న రోగులకు తమ వంతు సహాయ, సహకారాలందించారు.

తాజావార్తలు