ఉత్కంఠపోరులో భారత్ విజయం
రారే వన్డేలో టీమిండియా అనుహ్య విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రహానే సేన 4 పరుగుల తేడాతో నెగ్గింది. 256 పరుగుల లక్ష్య చేధనలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ చిగుంబుర సెంచరీతో గుబులు రేపినా.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తేడాతో ముందంజ వేసింది.
తొలి వన్డేలోఆతిథ్య జింబాబ్వే టీమిండియాకు చెమటలు పట్టించింది. కెప్టెన్ చిగుంబుర సూపర్ బ్యాటింగ్ తో చివరి బంతి వరకు పోరాడింది. చివర్లో ఒత్తిడి తట్టుకోలేక చిత్తైంది. లాస్ట్ ఓవర్ లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో జింబాబ్వే కేవలం 5 పరుగులే చేసింది. నాలుగు పరుగుల తేడాతో ఓడింది. చిగుంబుర 104, తిరిపానో ఒక్క పరుగుతో నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో బిన్ని, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే జట్టు.. 256 పరుగుల లక్ష్య చేధనలో 47 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అయితే, కెప్టెన్ చిగుంబుర ఫామ్ కంటిన్యూ చేశాడు. మూడో వికెట్ కు మసకద్జతో కలిసి 42 పరుగులు జోడించాడు. మసకద్జ, విలిమయ్స్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఇక చిగుంబురకు జతైన సికిందర్ రాజా ఐదో వికెట్ కు 48 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశాడు. 37 రన్స్ చేసిన రజా.. భజ్జీ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
ఏడో వికెట్ కు క్రీమర్, చిగుంబురలు 86 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేయడంతో జింబాబ్వే విజయం దిశగా దూసుకెళ్లింది. కీలక సమయంలో క్రీమర్ ఔట్ కావడంతో జింబాబ్వే విజయంపై ప్రభావం చూపింది. దీనికి తోడు చివరి ఓవర్లో భువనేశ్వర్ సూపర్ బౌలింగ్ తో అదరగొట్టడంతో జింబాబ్వే విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే, టాపార్డర్ బ్యాట్స్ మెన్ రాయుడు సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఆల్ రౌండర్ బిన్ని సైతం ధనాధన్ ఇన్నింగ్స్ తో తన వంతు సహకారం అందించాడు. రాయుడు అజేయంగా 124 రన్స్ చేయగా , బిన్ని 77 పరుగులతో రాణించాడు. కెప్టెన్ రహానే 34 రన్స్ చేశాడు. విజయ్, ఊతప్ప, తివారీతో పాటు కేదార్ జాదవ్ లు నిరాశ పర్చారు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో తిరిపానో, చిబాబా లు తలో రెండు వికెట్లు తీశారు.
ఇక సూపర్ సెంచరీతో టీమిండియా విక్టరీలో కీ రోల్ పోషించిన అంబటి రాయుడుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. రెండో వన్డే ఆదివారం ఇదే వేదికపై జరగనుంది.
పునరావృతం అవుతుందేమో అనిపించిన గతం తృటిలో తప్పిపోయింది. బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవం మరోసారి క్రికెట్ అభిమానుల కళ్లముందు కదలాడింది. అయితే.. అదృష్టం కలిసిరావడంతో ఒడ్డునపడింది టీమిండియా. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఓటమి కోరల్లోకి వెళ్లిన భారత జట్టు.. చివరకు విజయం సాధించింది. అంబటిరాయుడు సత్తా చాటడంతో ఓటమి ప్రమాదం తప్పిపోయింది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే జట్టు.. టీమిండియాకు చుక్కలు చూపించింది. చివరి ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లిన ఆతిథ్య జట్టు విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 256 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. టీమిండియాకు దడ పుట్టించింది. మొదట్లో త్వరగా వికెట్లు కోల్పోయినా.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన చిగుంబురా సెంచరీతో వీరవిహారం చేశాడు.
విజయం దిశగా దూసుకెళ్లిన జింబాబ్వే..
అయితే.. చిగుంబురాకు ఇతర ఆటగాళ్లనుంచి సరైన సహకారం లభించలేదు. ఏడో వికెట్‌కు 86 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జింబాబ్వే విజయం దిశగా దూసుకెళ్లింది. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో.. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఓటమి నుంచి బయటపడింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 251 పరుగులు చేసింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్, భువనేశ్వర్, కులకర్ణి తలోవికెట్ దక్కించుకున్నారు.
అష్టకష్టాలు పడిన భారత్..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. అష్టకష్టాలు పడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో నిలవకపోవడంతో టీమిండియా స్కోరు బోర్డు నత్త నడకను తలపించింది. 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారతజట్టును అంబటి రాయుడు, స్టువర్ట్ బిన్ని ఆదుకున్నారు. పట్టుదలతో క్రీజులో పాతుకుపోయిన రాయుడు.. ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. సెంచరీతో పోరాటం సాగించిన రాయుడికి.. 77 పరుగులు చేసిన బిన్నీ చక్కటి సహకారం అందించాడు. దీంతో.. టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మొత్తానికి జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ గెలిచినా.. చావుతప్పి, కన్ను లొట్టపోయిన చందంగా తయారైంది పరిస్థితి