ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న గందె జనార్ధన్
ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 13 (జనంసాక్షి)
ఆదివారం హైదరాబాదు నందు వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో కర్మాన్ఘాట్ కన్వెన్షన్ లో జరిగిన గురుపూజోత్సవం 2022 కార్యక్రమంలో ఖమ్మంలోని ప్రముఖ సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్ జనార్ధన్ కి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇవ్వబడింది. ఈ పురస్కారాన్ని చంద్రయ్య (హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్), వేణుగోపాల్ చారి(𝚎𝚡 𝙼𝙿), దివగ్న శర్మ మరియు కాశం సత్యనారాయణ (పౌండర్ అండ్ చైర్మన్ వ్యాస వికాస వేదిక) చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఖమ్మం నుండి వివిధ కళాశాలలో 24 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులకు ఫిజిక్స్ బోధిస్తూ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సీట్లు సాధించడంలో వారు చేసిన కృషి ఈ పురస్కారం అందించారు.