ఉత్తమ పంచాయతిగా ఉల్లంపల్లి
-గ్రామంలో పారిశుద్ధ్య పనులు పరిశీలించిన పంచాయతీ అధికారులు
జనం సాక్షి,వంగూర్:
ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన ఉల్లంపల్లి గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు సర్పంచ్ బుడ్డ బక్కయ్య ఆధ్వర్యంలో పంచాయతీ అధికారుల బృందం మంగళవారం గ్రామంలో పర్యటించారు.
ప్రతి ఇంటికి, ప్రభుత్వ సంస్థలైన స్కూల్, అంగన్వాడి సెంటర్లు, గ్రామపంచాయతీ బిల్డింగ్ అక్కడున్న ఇంకుడు గుంతలు,అదే విధాంగా మరుగుదొడ్లు నిర్మించుకొని వినోయోగంలో లేనివి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.మురికికాలువలు,రోడ్లు క్రమంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఇండ్లనుండి వ్యర్థమైన నీరు రోడ్లపై కి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
తడి,పొడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి సెగ్రీ గేషన్ షెడ్ కు తరలించాలన్నారు, వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి గ్రామపంచాయతీ ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బహిరంగ మాలమూత్ర విసర్జన శాశ్వతంగా నిషేధించే ఇదంగా కృషి చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో చారకొండ మండల బృందం ఎంపీడీవో జయసుధ, ఎంపీఓ వెంకటేష్,ఏపిఎం బాల చందర్,పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,ఐకేపి సీసీ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
