సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (జనంసాక్షి): ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.సన్నబియ్యం పథకం ఒక అద్భుతం..ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం. భూ భారతిని రైతులకు చేరవేయాలి .దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి .దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది .ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు .బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి.పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది.. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరి అవుతున్నాడు.వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది .అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయి.సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి.. సన్న బియ్యం మన పథకం..,మన పేటెంట్,మన బ్రాండ్. వేసవిలో కన్స్యూమర్‌ డ్యూరబుల్‌ కంపెనీల అమ్మకాలు పెరుగుతున్నాయి. గతేడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయి. ఈ సంవత్సరం సైతం వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దాంతో ఈ ఏడాది ఏసీలు 30 నుంచి35 శాతం, కూలర్లు 10శాతం, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పది నుంచి 15శాతం వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దాంతో కూడా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.గత సంవత్సరం లాగే.. ఈ ఏడాది వేసవికాలంలో వేడిగా ఉంటుందని గోద్రేజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నంది తెలిపారు. ఈ క్రమంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్‌ పెరుగుతోన్నది. వేసవిలో ముఖ్యంగా ఏసీలకు డిమాండ్‌ ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా.. అన్ని తరగతుల్లోనూ పెరుగుతున్నది. ఏసీ పరిశ్రమ 30 నుంచి 35శాతం, రిఫ్రిజిరేటర్లలో 10 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాబోయే వేసవి కాలంలో ఏసీ అమ్మకాలలో 50 నుంచి 70 శాతం వాల్యూమ్ వృద్ధిని, రిఫ్రిజిరేటర్లలో 25 నుంచి 30 శాతం వాల్యూమ్ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైయర్‌ అప్లయెన్స్‌ ఇండియా అధ్యక్షుడు ఎన్‌ఎస్‌ సతీశ్ పేర్కొన్నారు. వేసవిలో ఉష్ణోగత్రలు గరిష్ఠ స్థాయిలో ఉండడంతో శతలీకరణ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోందన్నారు. వినియోగదారులు సమర్థవంతమైన, స్మార్ట్, అనుకూలమైన, అధిక నాణ్యత గల ఉత్పత్తులను డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6 శాతం తగ్గిందని కమల్‌ నంది తెలిపారు. దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకు, దేశీయ మార్కెట్‌ నుంచి సేకరించిన వస్తువుల ధర పెరుగుదల కారణంగా ఇన్‌పుట్‌ ఖర్చు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీల ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ సారి పరిశ్రమ ఏసీ భాగాలు, కాంప్రెసర్ల రవాణాలో జాప్యం జరిగే అవకాశం ఉందని.. దాని కారణంగా ఏసీ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ పండితులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని సతీశ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మన్నికైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఆర్‌బీఐ రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించడం, ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడం డిమాండ్‌ పెంచేందుకు సహాయపడుతుందని కేర్‌ ఏజ్‌ రేటింగ్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ రజనీ సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ డిమాండ్‌లో మందగమనం ఉందని.. వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉండడం, రాబోయే సీజన్‌లో రుతుపవనాల సీజన్‌లో వర్షాపాతం సాధారణంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది.