సుడాన్‌లో పారామిలిటరీ బలగాల దాడి..
` 100 మందికి పైగా మృతి
నార్త్‌డార్ఫర్(జనంసాక్షి):ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దాడికి పాల్పడ్డాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడిరచారు. జామ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక, శనివారం అబూషాక్ శిబిరంపై దాడులు జరిపారు. ఇందులో 14 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరంపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్‌ఎస్‌ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (%ూAఖీ%), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (%Rూఖీ%) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోటి మందికి పైగా సూడాన్‌ను వదిలివెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.