ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తాం
` ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు త్రాగు, సాగు నీరందిస్తాం.
` కులగణన దేశానికి రోల్‌మోడల్
` 42% బీసీలకు రిజర్వేషన్ తీర్మానం
` ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం
` 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చాం
` రూ. 9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఉపాధి.
` ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క
మంచిర్యాల ప్రతినిధి (జనంసాక్షి):గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిరాదరణకు గురైన ప్రాణహిత, చేవెళ్ల సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క ప్రారంభించారు. పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మిస్తున్న మాతా,శిశు , సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఎలా ఉండబోతోందో ఎమ్మెల్యే మంత్రులకు వివరించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి సమీపాన కట్టవద్దని కోరినా గత పాలకులు వినిపించుకోలేదని భట్టి అన్నారు. పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐబీ స్తలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చామని అనుకున్నట్లే నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా తీయగా ఆ ర్యాలీలో భట్టివిక్రమార్క పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జెడ్‌పి బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ లో ఉపముఖ్య మంత్రి భట్టివిక్రమార్క ప్రసంగించారు . టీఆరెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిన ప్రాజెక్టును ప్రారంభిస్తామని భరోసాను ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికి కుల గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశామని పేర్కొన్నారు. కులగణన దేశానికి రోల్‌మోడల్ అని పేర్కొన్నారు.దళిత సామాజికవర్గ అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ కాలంలో 56వేల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చామని పేర్కొన్నారు .నిరుద్యోగ యువతకోసం తొమ్మిది 1000 కోట్లతో రాజీవ్ యువ వికాసం అనే స్కీము తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 13525 కోట్ల తో పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు 2675 కోట్ల తో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంపై తనకు ఎంతో మమకారం ఉందని తన నియోజకవర్గ ము మధిర ఎంతో ఈ సెగ్మెంట్ అంతే ఇస్తామన్నారు. ప్రేమ్ సాగర్ రావుతో ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధి కి తప్పకుండా సహకరిస్తామని అన్నారు. 765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు.అనంతరం ఐటి శాఖ మంత్రులు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ…ఏడాదిలోపు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజాపాలనను తీసుకువచ్చామని తెలిపారు. మంచిర్యాల లో ఐటీ పార్కు కు నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంచిర్యాల ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈసమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొనగా, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించారు.