ఉత్తర్వులు అమలు చేయండి
ఆదిలాబాద్, డిసెంబర్ 9 : విద్యా శాఖలో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించడం లేదని టీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీకల్ మూడు ప్రకారం 20 శాతం ఇతర ప్రాంతాల వారికి ఓపెన్ క్యాటగిరీలో కాకుండా రిజర్వేషన్లలో ఉద్యోగాలు కల్పించడం చట్ట విరుద్ధమని అన్నారు. 20 శాతం కోటాను ఓపెన్ క్యాటగిరీలో మెరిట్ సాధించిన అభ్యర్థులతోను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 10వ పీఆర్సీని జూలైనాటి వరకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాలలో నకిలీ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.