ఉద్యమంలో పాల్గొన్నా ప్రాధాన్యం లేదని

ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యం లేదని ఆరోపిస్తూ ఓ యువకుడు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. నల్లగొండలోని నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చాంద్‌బాషా అనే కార్యకర్త వాటర్‌ ట్యాంకు ఎక్కి కాసేపు జనాలను హడలెత్తించాడు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యం లేకుండో పోతోందని వాపోయాడు. ట్యాంకు పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. స్థానికులు నచ్చజెప్పి ఆయనను జాగ్రత్తగా కిందికి దింపారు.