ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తుంచాలి
ములుగు జూన్ 2 జనం సాక్షి ):-
తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన వరకు తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాల్లో పాల్గొన్న ఉద్యమకారులను, అమరులైన కుటుంబ సభ్యులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి అన్ని విధాల ఆదుకోవాలని హన్మకొండ జిల్లా జాక్ ఛైర్మన్ తాడిశెట్టి క్రాంతి కుమార్ అన్నారు. హన్మకొండ జిల్లా జాక్ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ జిల్లా కేంద్రం లష్కర్ బజార్ తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ 8 వ అవతరణ దినోత్సవంలో ఆయన పాల్గొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ జెండా ఎగురవేసి, అమరవీరులకు నివాళులు అర్పించి మాట్లాడాడు.
అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ అని త్యాగధనుల ఆశయాలకనుగుణంగా తెలంగాణ నిర్మాణం జరగాలని, తెలంగాణ ఉద్యమకారులను, వారి కుటుంబాలను, కవులు, కళాకారులను గుర్తించి వారికి గౌరవ పెన్షన్ ఇవ్వాలని, విద్య, వైద్య, ఉపాధి రంగాలను మెరుగుపరచి తెలంగాణను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
న్యూ లయోల స్కూల్ లో..
హన్మకొండలోని న్యూ లయోల హై స్కూల్ లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనగా ఈ కార్యక్రమంలో కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, రాజేశ్వర్ రావు, కార్తీక్, సుప్రజ, రవీందర్, అన్వర్, ముక్తార్, జహాంగీర్, నభి, నిశాంత్, పరకాల కుమారస్వామి, ప్రభాకర్, జ్ఞాన, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.