ఉద్యోగులను వేధిస్తున్న డిపో మేనేజర్ అర్పిత

యూనియన్ జోన్ అధ్యక్షులు రవీందర్…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 12
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కంట్రోలర్ రాజ వీరు మృతికి హుజురాబాద్ డిపో మేనేజర్ అర్పిత వేధింపులే కారణమని, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ కరీంనగర్ జోన్ అధ్యక్షులు జే రవీందర్ ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బక్కి రాజ వీరు అనే టిఎస్ఆర్టిసి కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్న, రాజవీరును హుజురాబాద్ డిపో మేనేజర్ అర్పిత అకారణంగా విధుల నుండి సస్పెండ్ చేసిందని, రాజ వీరు ఉత్తమ కంట్రోలర్ గా 7 సార్లు సంస్థ నుండి అవార్డు పొందినట్లు చెప్పారు. డిపో మేనేజర్ గా అర్పిత బాధ్యతలు తీసుకున్న నాటినుండి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తుందని, కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉద్యోగ ఎంపికైన రాజవీరును, అకారముగా సస్పెండ్ చేయడంతో మనస్థాపానికి చెంది ఈనెల 11న గుండెపోటుతో రాజా వీరు మృతి చెందడం చాలా బాధాకరమని, రాజ వీరు మృతికి కారణమైన డిపో మేనేజర్ అర్పితను సస్పెండ్ చేసి బాధ్యత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతి చెందిన రాజ వీరు కుటుంబానికి యూనియన్ అండగా ఉంటుందని వెల్లడించారు. రాజవీరు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించి మూర్తి గల కారణాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఏ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.