ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేసిన కలెక్టర్.
జనగామ కలెక్టరేట్ అక్టోబర్ 21(జనం సాక్షి): పశుసంవర్ధక శాఖలో కార్యాలయ సబర్డినెట్ గా ఉద్యోగ నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య కలెక్టర్ కార్యాలయంలో గురువారం శాకంపల్లి స్వామికి అందజేశారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి కి చెందిన శాకంపల్లి సాత్మా రాములు తీవ్రవాదుల చేతిలో మృతిచెందినందున అతని కుమారుడైన శాకంపల్లి స్వామికి ఉద్యోగ అవకాశం కల్పించాలని హైకోర్టు ఆదేశించినందున ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో కారుణ్య నియామకం కింద పశు సంవర్ధక శాఖలో కార్యాలయ సబర్డినేటర్గా ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మన్సూరి పాల్గొన్నారు.