ఉన్నత విద్యామండలి ఖాతాల స్తంభన కేసు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎస్‌బీహెచ్ ఖాతాల స్తంభనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఖాతాల స్తంభన ఎత్తివేసి యథాస్థితిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. రెండు రాష్ర్టాల పిటిషన్ల వాదనలు 25వ తేదీన వింటామని కోర్టు తెలిపింది.