ఉపతాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన బీఎస్పీ నాయకులు

మల్దకల్ జూలై14 (జనంసాక్షి) మండల కేంద్రంలోని బస్టాండులో నివాసముంటున్న సంచార జాతుల వారికి ఒక ఎకరా భూమి, కాలి ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసిల్దార్ కార్యాలయంలో బస్టాండ్ ప్రాంతంలో నివసించుచున్న సంచార జాతుల ఉప తహసిల్దార్ వినతి పత్రం అందజేశారు. బస్టాండు ప్రక్కన పది సంవత్సరములకు పైగా గుడారాలు వేసుకుని, జీవనోపాధిని ఆర్థిక ఇబ్బందుల పరిస్థితులలోనడుపుకుంటున్న, సంచార జీవన కుటుంబాలు నివాసముంటున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కిందట నిధులు మంజూరు చేయాలని,గద్వాల్ నియోజకవర్గ  బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఒక వారం రోజుల కిందట వారి దగ్గరికి వెళ్లి వారి తెలుసుకోవడం జరిగింది. వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లు లేవని క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో
గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు బలిగెరఎస్. రాజు
గద్వాల్ టౌన్ అధ్యక్షులు బోయ మoడ్ల రవి,బి.ఎస్.పి.కార్యకర్త గోకారి ,సోషల్ మీడియా కన్వీనర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.