ఉపాద్యాయుల ను సస్పెండ్ చేయాలి

 సునారికారి రాజేష్         PDSU  జిల్లాఅధ్యక్షుడు
కడం జూలై 06(జనం సాక్షి) మండలాల్లో ని మారుమూల గిరిజన గ్రామాలో ఉపాధ్యాయులు లేక ఉన్న ఉపాద్యాయులు సమయానికి రాక గిరిజన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు నాణ్యమైన విద్య కు దురమౌతున్నారు.మండల విధులకు దుమ్మలు కొడుతూ సోత పనులలో నిమగ్నమయ్యారు. కడం మండలంలోని దూబ్బతండా, పాలరెగడి, మిద్దెచింత తదితర గ్రామాలలో పాఠశాలలు సక్రమంగా నడవడంలేదు విద్యార్థుల కు చక్కటి విధ్యానందించాల్సిన ఉపాద్యాయులు విదులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ ఉపాద్యాయుల ను సస్పెండ్ చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయ పాఠశాలల పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU జిల్లా అధ్యక్షుడు సునార్ కారి రాజేష్ ప్రధాన కార్యదర్శి మాలవత్ జేవింద్ లు  జిల్లా మండల విద్యాశాఖ అధికారులు,  కలెక్టర్ ను కోరారు. విద్యారంగ పై విద్యాశాఖ పర్యవేక్షణ వుండాలి. ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ,గిరిజన తదితర పాఠశాలలు సక్రమంగా నడిచేందుకు చర్యలు తీసుకోవాలని PDSU డిమాండ్ చేస్తుంది