ఉపాధి కూలీలకు ఆలస్యంగా డబ్బు చెల్లింపు
మహబూబ్/-నగర్,జూలై27(జనంసాక్షి): జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు పదేపదే ఆదిశించినా ఉపాధి కింద పనిచేసిన వారికి చెల్లించే కూలీలో ఆలస్యం పత్పడం లేదు. మంత్రి ఆదేశాలు ఇస్తున్నా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చే కూలీ డబ్బులు ఇప్పుడు సరిగా రావడం లేదని కూలీలు వాపోతున్నారు. పని చేసిన రోజులకు సంబంధించిన కూలీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఉపాధిహావిూ పథకంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోట్ల కూలీ డబ్బులు నిలిచిపోయాయని సమాచారం. గత నెల రోజుల నుంచి ఈ కూలీ డబ్బులు రాకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం పెద్దగా లేని ఈ తరుణంలో కూలీలకు ఉపాధి పనులే వీరికి ఆసరాగా నిలిచినా డబ్బులు రాకపోయినా నిత్యం ఎండలో కష్టపడుతున్నారు. మరోవైపు.. పని చేయడానికి సిద్ధంగా ఉన్న చాలా గ్రామాల్లొ నిరుపేదలకు ఉపాధి సిబ్బంది పనులు చూపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉపాధిహావిూ కింద ఎనిమిది గంటలు కష్టపడి
పనిచేసినా సగటు కూలీ రూ.180 వచ్చే అవకాశం కూఆ లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షన్నర కూలీలు రోజూ పనులకు వస్తూనే ఉన్నారు. అయితే డబ్బులురాగానే త్వరలోనే చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న మంత్రి తోణ ఎల్లింపులకు ఆదేశాలు ఇచ్చారు.