ఉపాధి హామీలో కొత్త పనులు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
శ్రీకాకుళం, జూన్ 16 (జనంసాక్షి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త పనులకు ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసర మయ్యే పనులపై వ్యవసాయ అనుబంధ శాఖలకు ఉపయోగపడే పనులను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంజూరు చేసింది. ఈ పనుల మంజూరు ద్వారా వేతన దారులకు మరింత ఉపాధి కల్పిం చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మంజూరైన పను లకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి అని ఆదేశిం చింది. వ్యవసాయ గట్లు, కాల్వల నిర్మాణాల పనులు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులకు పెం చుతూ నిర్ణయం తీసుకుంది.
గతంలో 3,200 రూపాయల మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయిం చగా, 9,900 రూపాయలకు పెంచారు. దీనిలో 10 శాతం లబ్ధిదారుని వాటా కాగా, 4,500 రూ పాయలు ఉపాధి హామీ పనుల రూపంలోను మరో 4,500 రూపాయలు పరిశుద్ధ్య పథకం కింద మంజూరు చేస్తారు. పౌల్ట్రి రంగంలో సహాయాన్ని అందించే ఆదాయ వనరులు పెంపొందించేందుకు షెల్టర్లు ఏర్పాటునకు అవకాశం కల్పిస్తుంది. కోళ్లకు మౌలిక వసతులు లేక వ్యాధుల భారీన పడి చనిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వంద కోడ్లు నివాసం ఉండేందుకు వీలుగా 9.50 చెదరపు మీటర్లు వీస్తిర్ణంలో నిర్మించేందుకు వీలు కల్పంచారు. గొర్రెలు, మేకల కోసం షెల్టర్ల ఏర్పాటునకు నిర్ణయించారు. పశువులకు ఆశ్రమం కల్పిం చాలనే లక్ష్యంతో సెజ్‌ల ఏర్పాటునకు చర్యలు చేపట్టనున్నారు. చేపల ఉత్పత్తి కోసం ఉపాధి హామీ ద్వారా చెరువులో అభివృద్ధి చేసు కునే అవకాశం కల్పించారు. చేపలు అరబెట్టు కునేందుకు షెడుల నిర్మాణానికి నిర్ణయించారు. వ్యవసాయ పశుసంవర్దక శాఖ, మత్స్సకార శాఖ లతో పాటు వారద కాల్వల మరమ్మతులకు ఉపా ధి నిధులు విచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.