ఉపాధ్యాయులకు శాపంగా మారిన సిపిఎస్ విధానం
సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలి:సిపిఎస్ మండల అధ్యక్షులు వాసం ప్రభాకర్
కొత్తగూడ సెప్టెంబర్ 1 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలోని పాఠశాలలో సిపిఎస్ మండల అధ్యక్షులు వాసం ప్రభాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన నూతన పెన్షన్ సిపిఎస్ ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సెప్టెంబర్ ఒకటి 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పేరుతో ఈ రాష్ట్రంలో నూతన పెన్షన్ విధానం అమలవుతుందని దీని ద్వారా ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కొరవడుతుందని అన్నారు.పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో త్రొక్కి ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేటట్లు
ఫి.ఎఫ్.ఆర్.డి.ఎ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సిపిఎస్ ప్రవేశ పెట్టిన సెప్టెంబర్ 1 తారీఖున చీకటి దినం గా భావిస్తూ జడ్పీహెచ్ఎస్ ఓటాయి పాఠశాల లో నల్ల భ్యాడ్జిలు దరించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసననూ తెలియజేస్తూ విధులకు హాజరైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్,ఉపాధ్యాయులు సాంబయ్య,రాజ్ కుమార్,కోటి,రమేష్,రాజు,రమేష్,యాదగిరి,మమత,మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.