ఉపాధ్యాయులలో ఆత్మవిశ్వాసం పెంచాలి పి ఆర్ టి యు

PRTU TS అందోలు మండల శాఖ ఆధ్వర్యంలో PRTU TS 2022 సభ్యత్వ నమోదు
జనం సాక్షి జోగిపేట ఆందోల్ గురువారం జిల్లా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిష్కరించాలంటూ ఉపాధ్యాయ బృందం పరిషత్ ఉన్నత పాఠశాల జోగిపేట,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డాకూర్, ప్రాథమిక పాఠశాల డాకూర్, ప్రాథమిక పాఠశాల బ్రాహ్మణ పల్లి,ప్రాథమిక పాఠశాల తాడ్మనూర్,ఆదర్శ పాఠశాల ఆక్సన్ పల్లి,ప్రాథమిక పాఠశాల ఆక్సన్ పల్లి,ఉన్నత పాఠశాల ఆక్సన్ పల్లి,ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల తలెల్మా,ప్రాథమిక పాఠశాల నాదులపూర్, ఉన్నత పాఠశాల ,ప్రాథమిక పాఠశాల నెరడిగుంట పాఠశాలలలో PRTU TS 2022 సభ్యత్వ నమోదు పూర్తి చెయ్యనైనది.
నేడు PRTU TS 2022 అందోలు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు పర్యటనకు ముఖ్య అతిధిగా PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు,పత్రిక సంపాదక వర్గ సభ్యులు శ్రీ ఎ మాణయ్య గారు హాజరై వివిధ పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయిని ఉపాద్యాయులు లేవనెత్తిన ఎన్నో సమస్యలకు సవివరమైన వివరణ వారు ఇవ్వనైనది. దానిపట్ల ఉపాధ్యాయ బృందం సంతృప్తి వ్యక్తం చెయ్యనైనది.వారు మాట్లాడుతూ త్వరలో ఉపాద్యాయుల బదిలీలు ,పదోన్నతులు త్వరలో నిర్వహించడం జరుగుతుందని, మోడల్ పాఠశాల ఉపద్యాయుల నెలవారీ జీతాలు 010 పద్దుకు మార్చేలా PRTU TS కృషి చేస్తుందని వారు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు హామీ ఇవ్వనైనది.గతంలో ఆదర్శ పాఠశాలల ఉపద్యాయుకు సర్వీస్ రూల్స్ సందించిపెట్టిన సంఘం PRTU TS అని జ్ఞాపకం చేసుకున్నారు.బదిలీలు జరిగేలా PRTU TS కృషి చేస్తుందని భరోసా నిచ్చి  ఆదర్శ పాఠశాల ఉపాద్యాయులలో ఆత్మవిశ్వాసం నింపారు.
నేడు ఉపాధ్యాయలోకం అనుభవిస్తున్న సకల సౌకర్యాలు PRTU TS కృషి పలితమేనని ,భవిష్యత్ లో కూడా ఉపద్యాయుల సమస్యలు అన్నింటిని తీర్చి అన్ని కేటగిరీల ఉపద్యాయులకు అండగా వుంటూ సకల సదుపాయాలను కలిగించేది PRTU TS అని ఘంటా పదంగా చెప్పడంలో ఎలాంటి అతిశ్రేయోక్తి లేదని వారు తెలిపారు. PRTU TS  సంఘం  వుండటం ఉపాద్యాయులకు వరం అని వారు తెలిపారు. వీలైనంత త్వరగా జిల్లాలోని అన్ని మండల శాఖలు PRTU TS సభ్యత్వం పూర్తి చేయాలని వారు తెలిపారు. PRTU TU రాష్ట్ర ఉపాధ్యక్షులు పాఠశాలలలను సందర్శించి ఉపద్యాయుల సమస్యలను ప్రతేక్షంగా తెలుసుకొని పరిష్కరిం పట్ల భరోసా నివ్వటం పట్ల మండలం లోని వివిధ పాఠశాలల ఉపాద్యాయలు హర్షం వ్యక్తం చేశారు.
సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్ర బాద్యులు మధుసూదన్, మంజ్య నాయక్, యాదయ్య,జిల్లా బాద్యులు అనిల్ కుమార్,సుభాష్, జనార్దన్ రెడ్డి,మౌలానా,కృష్ణయ్య,రవీందర్, సర్ధార్, నర్సింగ్,రమేష్, మండల అధ్యక్షులు నరోత్తం కుమార్,ప్రధాన కార్యదర్శి రాజమల్లు ,మండలబాద్యులు సంతోష్, మహేష్ కుమార చారి ,మహేందర్,సంతోష్ రాజ్,సంతోష్, కిరణ్ గౌడ్, మాయ చారి, జనార్దన్ గౌడ్,వీరేశం,చంద్రశేఖర్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపద్యాయులు పాల్గొన్నారు.