ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధించాలని
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలో సమూల మార్పులు వచ్చాయని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బుధవారం నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలోని ఎంపిపి ఎస్, జిల్లా పరిషత్ ఉన్నత, జక్లేర్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాల, ఎంపిపిఎస్ ప్లే గ్రౌండ్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా పరిషత్ చైర్మన్ వనజ ఆంజనేయులు తో కలిసి పాఠశాల పనుల గురించి డిఈ నీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల యొక్క సామర్ధ్యాలు సాధించే విధంగా అందరూ పాఠ్యాంశ బోధన చేసేటప్పుడు కచ్చితంగా లెసన్ ప్లాన్, ఎఫ్ఎల్ఎన్ తొలి మెట్టు మాడ్యూల్స్ ను మరియు టీచర్ లెర్నింగ్ మెటీరియల్ ను ఉపయోగించి విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధించాలని అన్నారు. విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలు సాధించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, టి ఎస్ఈడబ్లు, ఐడిసి డిఈ రాము, ఏఈ శ్రీకాంత్, ఎంపిడిఓ, సెక్రటరీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.