ఉప్పర్ల సంఘంతో చంద్రబాబు సమావేశం
అనంతపురం: అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ ఇబ్బందులను చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు.