ఉప్పునుంతల మండల కేంద్రంలో పోస్టాపిస్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఈడీ దాడులను నిరసిస్తూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా కాంగ్రెస్  నాయకుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని నిరసిస్తూ,
చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల పై లాఠీఛార్జ్ అక్రమ కేసులు పెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా…
ఏఐసీసీ, టిపిసిసి, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ మాజీ ఎమ్మెల్యే గారి అదేశాను సారంగా…
ఈ రోజు ఉప్పునుంతల మండల కేంద్రంలో పోస్టాఫీసు ముందు ధర్నా,నిరసన కార్యక్రమం నిర్వహించారు…ఈ కార్యక్రమాని ఉద్దేశించి ఉప్పునుంతల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం తన ప్రాబల్యం తగ్గిపోతుందన తరుణంలో ఎలాగైనా తన బలం నిరూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల పైన అక్రమ కేసులు వేసి తన అహన్ని ప్రదర్శిస్తున్నాయి. బిజెపి ప్రభుత్వం పెట్టిన ఈడీ కేసు పూర్తిగా ఆధారం లేదని సుప్రీంకోర్టు ఇదివరకే క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ గారి  స్వంత రాష్ట్రం అయినా గుజరాత్ కు చెందిన లలీత్ మోడీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి మరి కొంతమంది వెలా కోట్లు అక్రమంగా బ్యాంకు రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోవాడానికి సహకరించిన మోడీ , వీళ్ళ పైనా చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాల నాయకుల పై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం.
ప్రధాని మోదీ ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే గాంధీ కుటుంబం పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంస్థలను  కార్పొరేట్లకు కట్టబెడుతున్న మోడీ కి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చేబుతారన్నారు.
ఈకార్యక్రమంలో తాడూర్ ఎంపిటిసి తిరుపతయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాత్లావత్ కృష్ణ, మండల యూత్ ఇంచార్జి శేఖర్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీను, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుండేమోని శ్రీశైలం,జనార్దన్, వార్డు మెంబర్లు వీర స్వామి, ప్రహ్లద్, గ్రామ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రాజు,సదగోడు గ్రామ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి,రజనీకాంత్, రేణయ్య, ఆటో కృష్ణ,స్వామి, శ్రీను, సాయి బాబు,మైనారిటీ నాయకులు ఇబ్రహీం, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెల్టూరి శ్రీహరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.