ఉప్పొంగిన జాతీయ భావం
*:మండల కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన
జూలూరుపాడు, ఆగష్టు 16, జనంసాక్షి: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్క నిమిషం సామూహికంగా జాతీయ గీతాలాపన చేసి దేశ భక్తిని మరింత చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల యంత్రాంగం సర్వం సన్నద్దమై తగు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే మండల కేంద్రంలోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు, అంబేద్కర్ సెంటర్ వద్ద సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చి సామూహిక జాతీయ గీతాలాపనతో మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, స్తానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సామూహిక జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్యా సోని, జడ్పీటీసీ కళావతి, సర్పంచులు లకావత్ భారతి, గుండెపిన్ని విజయ, గలిగె సావిత్రి, ఎంపిటిసిలు పొన్నెకంటి సతీష్, దుద్దుకూరి మధుసూదనరావు, పెండ్యాల రాజశేఖర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్సై గణేష్, తహశీల్దార్ లూధర్ విల్సన్, ఎండీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు, ట్రాన్స్ కో ఇంజనీర్ ఆకుల రఘురామయ్య, ఎంఈవో వెంకట్, ఐకెపి ఎపిఎం సత్యనారాయణ రాజు, ఈజీఎస్ ఏపీవో సుహాసిని, గిర్దావర్ తిరుపతి, కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి పద్మజ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు,మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, మోదుగు రామకృష్ణ, రామిశెట్టి నాగేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పెండ్యాల ప్రసాదరావు, చాపలమడుగు రామ్మూర్తి, ధారావత్ రాంబాబు, పణితి వెంకటేశ్వర్లు, మహబూబ్, కిరణ్ అమృ, ఇల్లంగి తిరుపతి, బుడిపుడి ప్రభాకర్ పలువురు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.




