ఉప తహసిల్దార్ కి వినతి పత్రం అందిస్తున్న సాయి గుట్ట తాండ నివాసులు
జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని సాయిగుట్ట తాండ నివాసులు గురువారం మా ఇండ్ల స్థలాలు మాకు కావాలంటు ఉప తహసీల్దార్ భీష్మ నాయక్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పరెడ్డిపల్లి గ్రామ శివారు లోని గల 78/2 సర్వే నెంబర్లో గల భూమిలో ఇండ్లనిర్మాణం అనుమతి కొరకై మేము సాయిగుట్టతాండ వాస్తవ్యులను మేము గత కొన్ని సంవత్సరాల కాలం నుండి 78/2 సర్వే నెంబరు గల భూమిని సాగు చేస్తున్నాము. అందులో మా తాండ అయిన సాయిగుట్టతాండ అడవి సమీపంలో ఉన్నందున మా తాండ సమీపంలో అనేక అడవి జంతువులు, క్రూరమృగాలు సంచరిస్తుంటాయి కాబట్టి మా తాండ వాసులు ప్రతిరోజు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందుకుగాను ఈ పొలంలో మేము ఇండ్ల స్థిర నివాసం కొరకు నిర్మించుకోవాలని అనుకొని ముందుగా మాకులదేవతల విగ్రహాలను (గుడి)లను నిర్మించుకున్నాము. అయితే తిప్పరెడ్డిపల్లి గ్రామ వ్యాస్తవులైన చింతకుంట్ల రామస్వామి, వెంకటయ్య, ఈశ్వరమ్మ, ఇదమ్మ వీరు వచ్చి మా కుల దేవతలను కించపరిచి అవమానపరిచి భంగం కలిగించారు. కావున మా కులదేవతను అవమానించిన వారిపై చర్య తీసుకొని మా యొక్క సమస్య ను పరిష్కరించి పొలంలో మాకు ఇండ్లను నిర్మించుకోవడానికి అధికారులు స్పందించి మాపై దయవుంచి అనుమతి ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాత్లవత్ బీక్య, రాములు, వశ్య, బాల్య, బాన్య, జగ్య తదితరులు పాల్గొన్నారు.