ఉప ప్రణాళిక నిధుల సద్వినియోగం
ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి
తాండూరు, జనంసాక్షి: ఎస్సీఎస్టీలకు ప్రత్యేకంగా కేటాయించిన ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగం చేసుకుని రోడ్లు, మురుగుకాలువలు వంటి సౌకర్యాలను కల్పించుకోవలసిందిగా ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సూచించారు. శనివారం తాండూరు మండలం తరన్‌కోట్, ఓగిపూర్, చంద్రవంచ, ఎల్కటూర్ గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు.