ఉప ముఖ్యమంత్రి హామీతో దీక్ష విరమించిన వీహెచ్
హైదరాబాద్, జూలై 28 (జనంసాక్షి) : మేథోమథనం సదస్సు త్వరలో నిర్వహిం చనున్న ట్టు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీ మేరకు దీక్ష విరమిస్తున్నానని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. మేధో మథనం చేపట్టాలంటూ విహెచ్ శనివారం ఉదయం గాంధీభవన్‌లో మౌనదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం గాందీ óభవన్‌కు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి మేథో మథనంపై హామీ ఇచ్చారు. అంతేగాక విహెచ్‌కు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. విహెచ్ మాట్లాడుతూ ఇటీవల మంత్రివర్గ కమిటీ అందజేసిన నివేదికపై మేథో మథనం నిర్వహించాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని తాను కోరుకుంటున్నానన్నారు. అంత ేగాక తన మౌన దీక్ష కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేపట్టింది కాదన్నారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారికి కొద్ది కాలంగా న్యాయం జరగడం లేదని, దీంతో వారిలో అసంతృప్తి చోటు చేసుకుందని, దాన్ని పారద్రోలాలని ముఖ్యమంత్రి కిరణ్‌కు, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లకు సూచించానని, ప్రయోజనం లేకపోవడంతో మౌనదీక్ష చేపట్టానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎక్కడికి వెళ్లినా సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీ సేవల గురించి, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడాలని సూచిస్తున్నా న న్నారు. నామినేటెడ్ పోస్టులను కార్యకర్తలకే ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నారు. రానున్న 2014 ఎన్నికల్లో విజయం సాధించాలంటే వాళ్ల పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుందని, అందర్నీ కలు పుకుని పోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.