ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ (జనంసాక్షి): ముస్లిం మహిళల సమస్యల పరిష్కారానికి ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నరు. న్యాక్, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లను అనుసంధానం చేయాలని చెప్పిన్రు. ముస్లిం విద్యార్థులకు బస్ పాస్లు ఫ్రీగా ఇవ్వాలని కోరింన్రు. ఆంధ్రాపాలనలో తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కనుమరుగయ్యాయని, మణికొండలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని అక్బరుద్దీన్ పేర్కొన్నరు. షాదీ ముబారక్ స్కీంలో సర్టిఫికెట్లను తగ్గించాలన్నరు. ఉర్దూ పాఠశాలల్లో టీచర్లను నియమించాలని అక్బరుద్దీన్ ఓవైసీ కొరిన్రు. దర్గాలు, చర్చిల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని సూచింన్రు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అక్బరుద్దీన్ చెప్పిన్రు.