ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ప్రచార జోరు

కాంగ్రెస్‌ తరపున జైరామ్‌ రమేశ్‌ ప్రచారం

నల్గొండ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఓ వైపు కాంగ్రెస్‌ కూటమి, మరోవైపు టిఆర్‌ఎస్‌ ప్రచారంలో జోరు పెంచాయి. భువనగిరిలో కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఆ పార్టీ నేత జైరాం రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చింది కేసీఆర్‌ కుటుంబం కోసం కాదన్నారు. విభజన హావిూలు సాధించుకోవడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్‌ దివాలా తెలంగాణగా మార్చారని జైరాం రమేష్‌ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల్‌ జవిూలాపేట్‌ లో మహాకూటమి అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభంజనంఅనిల్‌ కుమార్‌ రెడ్డి గెలుపుతో మొదలవుతుందన్నారు. 25 సంవత్సరాలో మొదటిసారిగా భువనగిరిలో కాంగ్రెస్‌ గెలవబోతుంది అనిల్‌ గెలుపు ఎవరూ ఆపలేరని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అని తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. భువనగిరి అభ్యర్థి అనిల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ పైళ్ల శేఖర్‌ రెడ్డి స్థానికుడు కాదని తెలంగాణ వచ్చిన సందర్భంలో గాలిలో గెలిచిన శేఖర్‌ రెడ్డి సొంత పార్టీవారికే అభివృధి ఫలాలు అందిస్తున్నాడని అన్నారు. నిమ్స్‌ పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. తాను గెలిచినా తర్వాత అబివృది ఆంటేఏంటో చేసి చూపిస్తానని పార్టీలకు అతీతంగా పనిచేస్తానని అన్నారు. రాష్టంలో రాబోయేది మహాకూటమి ప్రభుత్వమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రమోద్‌ కుమార్‌, రామాంజనేలు గౌడ్‌ జడ్పీటీసీ బస్వయ్య కాంగ్రేస్‌ బీబీనగర్‌ అధ్యక్షులు శ్యామ్‌ గౌడ్‌ అచ్చయ్య గౌడ్‌ సుభాష్‌ రెడ్డి పాండు గౌడ్‌ తల్లం శ్రీనివాస్‌ ,కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . ఇకపోతే యాదగిరిగుట్ట మండలంలో ఆలేరు నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థి బూడిద.బిక్షమయ్యా గౌడ్‌ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వంగపల్లి,చోల్లేరు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి తనను ఆశీర్వదించాలని బిక్షమయ్యా గౌడ్‌ విజ్ఞప్తి చేసారు. హుజుర్‌ నగర్‌ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి , ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మర్రిగుడెం కరక్కాయాల గూడెం,బూరుగడ్డ గోపాలపురం ,కాసారీ గూడెం, లింగగిరి ,సీతారాంపురము ,శ్రీనివాస పురం ,అమరవరము ,అంజలీపురం అల్లి పురం ,లకారము తదితర గ్రామాల్లో ఇరువురు నేతుల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అతి విశ్వాసానికి పోయిన ఉత్తమ్‌ కుమార్‌ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిసైదిరెడ్డి సునావిూకి భయపడిగత రెండు రోజులుగా చక్కెర్లు కొడుతున్నారు. యాదవ సోదరులకు గ్రామ గ్రామానయాభై యూనిట్ల వరకు గొర్రెలపంపిణీ చేసిన ప్రభుత్వం తెరాస అని అన్నారు. మిషన్‌ కాకతీయ కింద వంద కోట్ల రూపాయల నిధులతో చెరువులను తవ్వించిమత్స్యకార కుటుంబాల స్వావలంబనకు చేప పిల్లల పథకాన్ని ప్రవేశపెట్టిందిన్నారు. నిన్నగాక మొన్న అమ్మ వచ్చితెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా వారికి మద్దతు పలకడం వారి కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు. బతుకమ్మ చీరల పంపిణీకి కూడా కేసులేసి అడ్డుకున్నా రన్నారు. కారు గుర్తు మనది సర్కారు కూడా మనదే కావాలని ఆకాంక్షించారు.