ఉలిక్కిపడ్డ గాంధారి మండలం లింగంపేట్ మండలం
–సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో ఏ వన్ గా లింగంపేట మండల వాసి. గాంధారి మండలం వాసి
–నిందితులు రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్స్
కేంద్ర ప్రభుత్వం సైనిక ఉద్యోగాల్లో ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకం కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో ఏ వన్ గా లింగంపేట్ మండలం ఎల్లారం వాసి మధుసూదన్ ను (20) మరియు గాంధారి మండలం లో అదర్ష్ అనే వ్యక్తి పోలీసులు చేర్చడంతో మండల వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు పేర్కొన్న అరెస్టు రిమాండ్ లో మధుసూదన్ ఆదర్శ్ ప్రకటించడం తో స్థానిక పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఎల్లారం గ్రామానికి చెందిన మధుసూదన్ గొల్ల కులానికి చెందిన వాడు కాగా, తండ్రి వ్యవసాయదారుడు అని గ్రామ సభ ద్వారా తెలిసింది. అందరితో కలుపుగోలుగా ఉండే మధుసూదన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సైతం పాల్గొన్నట్లు తెలుస్తుంది. సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న నిందితుడు అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు ప్రకటించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందినట్లు సమాచారం. గత శుక్రవారం జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో పాల్గొన్న మధుసూదన్ పెట్రోల్ తదితర వాటితో రైల్వే భోగి లను, ఇతర వాటికి అగ్ని అంటించడంలో ముందు ఉన్నాడని అలాగే గాంధారి మండలం నుండి ఆదర్శ్ అనే యువకుడు ఉండడంతో పోలీసులు ప్రకటించినట్లు సమాచారం. ఈ అల్లర్లలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డా విషయం విదితమే. రైల్వే శాఖ కు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. సైన్యంలో చేరుతాడు అనుకున్నా తమ గ్రామానికి చెందిన యువకులు జైల్లో ఉండటంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు
పోలీసుల కౌన్సిలింగ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులకు స్థానిక సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా లింగంపేట నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలం గాంధారి మండలం లోని పలు గ్రామాలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులకు సోమవారం కోసి నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే వారి తల్లిదండ్రులను స్టేషన్ పిలిపించి మాట్లాడినట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న పలువురిని హైదరాబాద్ కు తరలించినట్లు సమాచారం.