.*ఊపిరి ఉన్నంతవరకు ఊరి కోసం సేవ చేస్తా*
పెద్దేముల్ ఆగస్టు 25(జనం సాక్షి)
ఊపిరి ఉన్నంతవరకు ఊరి కోసం సేవ చేస్తానని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. గురువారం రోజు పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ గ్రామంలో
ఆంజనేయస్వామి పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నా పుట్టిన ఊరు గాజీపూర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. అనంతరం గాజీపూర్ లో ఆంజనేయ స్వామి పునర్నిమాణం కొరకు తన వంతు సాయంగా రూ.1,00,116 అందచేశారు. భవిష్యత్తులో గుడికి ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరప్ప, రవికుమార్, నరసింహారెడ్డి, నసీర్, నాగు పటేల్, సునీల్ గౌడ్, నాగభూషణం, శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, బైబిల్ , సంగమేశ్వర్, వెంకటయ్య మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు