ఊరంతా మట్టి వినాయకులె…
-ఆదర్శంగా నిలిచిన వెలిచాల
కరీంనగర్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి):పర్యావరణంకాలుష్యం బారిన పడి మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్పడడంతో అందరు మట్టి వినాయకులను ప్రతిష్టించాలనే ఆలోచన అందరికి వచ్చేదే కాని ఆచరణలో మాత్రం కొందరికే సాద్యం. ఇలా గ్రామంలొ మొత్తం ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకున్నారు. తమవంతు బాద్యతగా గ్రామంలో అన్ని కాలనీల్లో మట్టి గణపతులను ప్రతిష్టించి నవరాత్రుల పాటు వైభవంగా పూజలు జరిపి అందకిరి ఆదర్శంగా నిలిచిందీ ఈగ్రామం. గ్రామం పేరు వెలిచాల. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చుట్టూ పచ్చని పోలాలు ఎత్తైన చెట్లు చూపరులకు
ఆహ్లాదకరంగా ఉన్నా ఈ గ్రామం ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో ముందుంది. ఈ గ్రామంలో 1980 సంవత్సరం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే గడిచిన 37 సంవత్సరాలుగా గణనాథులను ప్రతిష్టించినప్పటికి ఈ మద్య కాలంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయకులను చెరువులో నిమజ్జనం చేయడం వలన మత్స్య సంపద, పశువులు కాలుష్యం బారిన పడి
మరణిస్తున్నాయి. దీనితోపాటు భూగర్బ జలాలు కలుషితం కావడంతో గ్రామంలోని ప్రజలు అనారోగ్యానికి గురి అవుతూ ఇబ్బందుల పాలు పడుతున్నారు. ఇది గమనించిన గ్రామస్థులు గడిచిన 5 సంవత్సరాలనుంచి చెరువులును రక్షించుకోవడంతోపాటు పర్యావరణాన్ని కాపాడలని గ్రామంలో అందరు ఒక్కతాటిపై నిలిచి ముందుకు సాగుతున్నారు. వెలిచాలర 1500 మంది ప్రజలు నివసించే ఒక కుగ్రామం. గ్రామంలో వీది వీదినా మట్టి వినాయకులను ప్రతిష్టించి అందరికి ఆదర్శంగా నిలిచారు. గణపతి అలంకరణకు వాడే వస్తువులు సైతం పర్యావరణానికి హాని కలిగించనివి వాడడం విశేషం. గణెళిశ్ విగ్రహతయారీకి వాడిన రంగులు పర్యావరణ రహిత విబిన్న రంగులతో గణనాథులను ఆందంగా అలంకరించారు. చూపరులను ఆకట్టుకునే విగ్రహాలు నిత్యం పూజలు అందుకుంటున్నాయి. ప్రతి రోజు అర్చనలు అభిషేకాలు నైవేద్యాలు సమర్పిస్తూ విశేష పూజలు నిర్వహించారు. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణపతులతో వాతావరణ కాలుష్యం అధికంగా కావడంతో గ్రామస్థులంతా కలిసి పర్యావరణాన్ని కాపాడే దిశగా ముందుకు సాగాలనిగ్రామపంచాయితీలో గ్రామస్థులంతా తీర్మాణం చేసుకుని కలిసికట్టుగా గ్రామంలో మట్టి వినాయకులనుప్రతిష్టిస్తున్నారు. మొదటి సంవత్సరం గ్రామ పంచాయితీ ఆద్వర్యంలో మట్టి వినాయకులను ప్రతిష్టించిన వారికి వెయ్యి పదిహెను వందలు ప్రోత్సాహకం అందించారు. ఆతర్వాత ఎవరికి వారే మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకుంటున్నారు.ఇప్పుడు గ్రామంలో మొత్తం 25 వినాయక మండపాలుండగా అన్ని మండపాల్లో కూడా మట్టితో చేసిన వినాయకులను పెట్టి వంద శాతం మట్టివినాయకులను పెట్టిన గ్రామంగా నిలిచింది. అలాగే పర్యావరణంను కాపాడుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలోని యువకులు వినాయకుని ఉత్సవాల్లో చురుకుగా పాల్గొని కాలుష్య రహితం దిశగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంతైనా ఊరు ఊరంతా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించిన గ్రామస్థులకు హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి.