ఊరూవాడా ప్రచార¬రు సాగిస్తున్న టిఆర్‌ఎస్
ర్యాలీలు, సభలతో దూసుకుపోతున్న అభ్యర్థులు
ప్రభుత్వ పథకాలే అజెండాగా ముందస్తు ప్రచారం
వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు మలివిడత ప్రచారాన్ని విస్తృతం చేశారు. కెసిఆర్‌తో భేటీ తరవాత సోమవారం నుంచే ప్రచారం ఉధృతం చేశారు. ఇంటింటి ప్రచారంతో స్వయంగా ఓటర్లను కలుస్తున్నారు. భారీ ర్యాలీలతో దూసుకుని పోతున్నారు. బూత్ కమిటీ సమావేశాలతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీ అధినేత కెసిఆర్ అందజేసిన లబ్ధిదారుల జాబితాలను ఓటర్లకు చూపెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకావడానికి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు తాజాగా అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలను వివరిస్తున్నారు. భారీ మెజార్టీతో గెలవటమే టార్గెట్‌గా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికల కోసం సెప్టెంబర్ 6వ తేదీన తాను ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చే సిన అభ్యర్థులందరు మలివిడత ప్రచారంలో దూకుడు మరింత పెంచాలని కేసీఆర్ చెప్పారు. ఒక్క రోజు కూడా విరామం లేకుండా ప్రచారం కొనసాగించాలని, సమయం వృధా కాకుండా ఎన్నికల ప్రచారం ప్రణాళికలను రూపొందించుకోవాలని చేసిన సూచనల మేరకు మంత్రులు కూడా రంగంలోకి దిగారు. జనగామ డివిజనల్‌లో మంతంరి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. స్టేషన్ ఘనపూర్‌లో మంత్రి కేటిఆర్ సయోధ్య సమావేశం చేపట్టారు. ఇకపోతే మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రి చందూలాల్ తమ నియోజకవర్గాల ప్రచారంలో బిజీగా ఉన్నారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఆయా శాసనసభ నియోజకవర్గంలో అమలు చేసిన తీరును వివరిస్తున్నారు.టీఆర్‌ఎస్ అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాల వల్ల వ్యక్తిగతంగా కలుగుతున్న లబ్ధిని వివరించారు. ఇదే సమయంలో పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను
ఓటర్లకు వివరిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీస్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం భూపాలపల్లి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన ఓటర్లను స్వయంగా కలుస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ములుగు నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రచార జోరు పెంచారు. 26వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు ఈ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించ నున్నట్లు చందులాల్ ముందుగానే ప్రకటించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలను కలిసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరోసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి తోడ్పతానని చెప్పారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నానని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత నెలన్నర రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ పాక్షిక మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రచారంలో మరింత స్పీడ్ పెంచామన్నారు. ఈ నేపథ్యంలో నేడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చే రీతిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన సాగడంతో ఎన్నికల సమయంలో అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ వస్తోందని పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎక్కడికి వెళ్లినా జనం జేజేలు పలుకుతున్నాకరి చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటికే మండలాల వారీగా అన్ని గ్రామాల బూత్‌ల వారీగా టీఆర్‌ఎస్ నాయకులు, ఇన్‌చార్జులతో సవిూక్షలు ముగిశాయి. బూత్‌ల వారి ఇన్‌చార్జులు ఇంటింటికెళ్లి నన్ను, టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నారు. నవంబర్ ఒకటి నుంచి తండాలు, కొత్త జీపీల్లో ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకున్నట్లు వెల్లడించారు.