ఎంఇఓలు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు 12,13న ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా తరగతులు.
డిఇఓ గోవింద రాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి):
ఎస్ ఎల్ ఎన్ తొలి మెట్టు కార్యక్రమం అమలులో భాగంగా పర్యవేక్షణకు సంబంధించి మరియు ఆన్లైన్ యాప్ లో మోనిటరింగ్ వివరాలను నమోదు చేయుట గురించి, మండల విద్యాధికారులకు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సోమవారం నుంచి రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ శిక్షణ 12 మరియు 13 న ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ యందు నిర్వహించ బడు తాయని తెలిపారు.మండల విద్యాధికారు లు,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.మండల నోడల్ ఆఫీసర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ఒక్కరే అయితే అటువంటివారు శిక్షణకు హాజరు కావలసిన అవసరం లేదన్నారు.మండల స్థాయిలో ఈ నెల 15న ఎఫ్ ఎల్ ఎన్ పై క్లస్టర్ వారిగా గుర్తించిన నలుగురు సబ్జెక్ట్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు మరియు సిఆర్పి లకు శిక్షణను అందించవలసి ఉంటుందన్నారు