ఎంఈడీ,ఎంపీఈడీ,డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు 28 న
ఉస్మానియ యునివర్సిటీ:ఓయు పీజిసెట్ 2012 లో మిగిలిపోయిన ఎంఈడీ, ఎంపీఈడీ,పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 న జరగనున్నట్లు జాయింట్ డైరక్టర్ డాక్టర్ ఎం.రాములు,డాక్టర్ ఎస్.కిషన్ తెలిపారు.ఓయు పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు రోజుల్లో హాల్‌టిక్కెట్లను జారీ చేయనున్నట్లు వారు తెలిపారు.ఎంఈడీ ప్రవేశ పరీక్ష ఉదయం 9.30 గంటల నుండి 11 గంటల వరకు,ఎంపీఈడీ పరీక్ష 12.30 నుంచి 2 గంటల వరకు,పీజీ డిప్లోమాల ప్రవేశల పరీక్ష సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు జరగనున్నట్లు చెప్పారు.