ఎంఎంటీఎస్ రైళ్లలో హిజ్రాలు, పోకిరీల ఆగడాలు
హైదరాబాద్ జనంసాక్షి : ఎంఎంటీఎస్‌లో ఖైరతాబాద్ వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మహిళల బోగీల్లో ఈవ్‌టీజర్ల సంఖ్య పెరిగిందని వచ్చిన ఫిర్యాదులపై ఈ దాడులు చేశారు. వందమంది హిజ్రాలు, పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.